![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -146 లో... సీతాకాంత్ ని తన పెళ్లి గురించి ఇంటర్వ్యూయర్ అడగ్గానే.. అది నా పర్సనల్ అంటూ కోపంగా లోపలికి వెళ్లిపోతాడు. ఇంటర్వ్యూయర్ వెళ్లిపోతుంటే.. ఆగండి అని సామల చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి వెళ్లి మీరు ఇలా ఎన్నిసార్లు చేస్తారు. ఒకసారి మీ పెళ్లి గురించి ప్రపంచానికి చెప్తే వాళ్ళు ఇంకోసారి ఇలా అడగరు కదా వాళ్ళకి మీరే అనే ఛాన్స్ ఇస్తున్నారని రామలక్ష్మి అనగానే.. సరే పదా కిందకి వెళదామని రామలక్ష్మిని తీసుకొని సీతాకాంత్ వెళ్తాడు. కెమెరా ఆన్ చెయ్యండి అని చెప్పి.. రామలక్ష్మిని తన పక్కన కూర్చొపెట్టుకుని తన భుజం మీద చెయ్యి వేస్తాడు.
ఈమె నా భార్య రామలక్ష్మి.. మేమ్ పెళ్లి చేసుకున్నాం.. ఇద్దరం ఒకరికొకరు ఇష్టపడ్డాం.. ఇందులో అనుమానమే లేదని రామలక్ష్మిని గొప్పగా పరిచయం చేస్తాడు సీతాకాంత్. దాంతో రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శ్రీలత, సందీప్, శ్రీవల్లి లు మాత్రం బిత్తరపోయి చూస్తారు. ఆ తర్వాత అసలు సీతాకాంత్ ఎందుకిలా చెప్పాడని శ్రీలత ఆలోచిస్తుంది. అప్పుడే తన దగ్గరకి శ్రీవల్లి వస్తుంది. చూసారా అత్తయ్య.. బావగారు అందరి ముందు ఎలా చెప్పాడోనని శ్రీవల్లి అంటుంది. అప్పుడే రామలక్ష్మి వచ్చి మీరు నాతో ఒక ఛాలెంజ్ చేశారు.. నేనే గెలిచాను.. ఎవరికి నేను సీతాకాంత్ భార్య అని తెలియదు అన్నారు కదా.. ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసేలా చెప్పారు. ఇదంతా నా ప్లాన్ అని రామలక్ష్మి చెప్తుంది..
ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్తుంటే.. ల్యాప్ టాప్ మర్చిపోయారని రామలక్ష్మి చెప్తుంది. థాంక్స్ రామలక్ష్మి ఈ రోజు నా కోపాన్ని కంట్రోల్ చేసావని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత టిఫిన్ చేద్దాం పదండి అని రామలక్ష్మి తీసుకొని వెళ్తుంది. అక్కడ శ్రీలత వాళ్ళున్నారని రామలక్ష్మి చూసి.. కావాలనే సీతాకాంత్ తో ఇక్కడ ఏదో అంటింది అండి అని అంటుంది. వాళ్ళ ఇద్దరినీ చూసిన పెద్దాయన.. మీకు దిష్టి తగులుతుంది. శ్రీలత వెళ్లినపుడల్లా వాళ్ళకి దిష్టి తీస్తూ ఉండమని శ్రీలతకి పెద్దాయన చెప్పగానే తను సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |